జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని రాజోలి మండల కేంద్రానికి చెందిన బటికేరి శ్రీనివాసులు అను వ్యక్తి 01 జూలై అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల జీవితం పై విరక్తి చెంది సుంకేసుల డ్యాం లో దూకి చనిపోవడం జరిగింది. అతని కుమారుడు బటికేరి భసవరాజు పిర్యాదు మేరకు 01 జూలై నుంచి భారతదేశ కొత్త చట్టాలు అమలు కావడంతో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు,IPS అదేశాల మేరకు రాజోలి ఎస్సై జగదీష్ సెక్షన్ 194 BNSS (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టం) ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ…. జిల్లా పరిధిలో ఉన్న పోలీసు అదికారులకు, సిబ్బందికి కొత్త చట్టాల పై అవగాహాన కలిగి ఉండేందుకు విడతలవారీగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా లోని సిబ్బందికి, అధికారులకు ఓరియెంటెడ్ తరగతులు నిర్వహించి 100% సిబ్బందికి, అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. కొత్త చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేయడం తో పాటు పకడ్బందీ గా అమలు చేయడం జరుగుతుందని అలాగే కొత్త చట్టాల SOP నీ అనుసరించి విచారణ చేపట్టడం, సాక్ష్యాధారాలను సేకరించి న్యాయ స్థానాలలో చార్జీ షీట్ వేయడం జరుగుతుందని అన్నారు.
ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగిందని, బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించడం, నేరాల విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా రూపొందించడం జరిగిందని అన్నారు. కొత్త చట్టాల వర్తింపు మరియు నేరాలు మరియు దానికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే దానిపై అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అలాగే రైటర్స్ కు ఏలాంటి సందేహాలు ఉన్న జిల్లా నుండి శిక్షణకు వెళ్లి వచ్చిన ఎక్ఫర్ట్ ఉన్నతాధికారులను సంప్రదించి ముందుకెళ్లె విధంగా చర్యలు చేపట్టడం జరిగిందనీ జిల్లా ఎస్పీ తెలిపారు.