TEJA NEWS

సబ్బుబిళ్ళ మీద అల్లూరి సీతారామరాజు చిత్రం చిత్రించిన

-రామకోటి రామరాజు సిద్దిపేట్ జిల్లా :

మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకొని సబ్బుబిళ్ల మీద అల్లూరి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి ఘనంగా నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాద గుండెల్లో వణుకు పుట్టించిన మన్యం విప్లవ వీరుడు యువతకు స్తూర్తి ప్రధాత తెలుగు తేజం అల్లూరి సీతారామరాజు అన్నారు. మన్యసీమ గాండ్రించిన మొనగాడు, తెల్ల దొరలను అడలించిన తెలుగుతల్లి బిడ్డడు మన అల్లూరి సీతారామరాజే అన్నారు


TEJA NEWS