తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్, రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.
సిటీలోని సెంబీయం ప్రాం తంలో ఉన్న తన నివాసా నికి సమీపంలో కొంతమంది పార్టీ కార్యకర్తలతో మాట్లా డుతుండగా బైకులపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
తీవ్ర గాయాలపాలైన ఆర్మ్‌స్ట్రాంగ్‌ను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. కాగా ఈ హత్య పై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇది ప్రతీకార హత్య కావొ చ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు ఫుడ్ డెలివరీ ఏజెంట్లు మాదిరిగా వచ్చినట్టు తెలుస్తోందని, అయితే ఈ విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.