అంబానీ సంపద తరిగిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
ముంబై:
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ రూ.10.21 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ‘కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయ్’ అనే సామెత ప్రకారం ఒకవేళ అంబానీ ఫ్యామిలీ రోజుకు రూ.3 కోట్లు ఖర్చు చేసినా, విరాళంగా ఇచ్చినా వారి సంపద మొత్తం 3,40,379 రోజుల్లో కరిగిపోతుంది.
అంటే 932 సంవత్సరాల 6 నెలలకు వారి సంపద జీరోకు చేరుకుంటుంది. అనంత్ అంబానీ పెళ్లికి రూ.5
వేల కోట్లు ఖర్చు చేసినట్లు టాక్.