TEJA NEWS

బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానం..

పాలకుర్తి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో కొన్ని సంవత్సరాలుగా విధి నిర్వహణలో భాగంగా కాని స్టేబుల్ గా సేవలు అందించి ప్రజల సమస్యలను పరిష్కారం చేసి ఉన్నత అధికారుల, ప్రజలను మన్ననలు పొంది ఎన్నో ప్రశంస పత్రాలు అవార్డులు పొంది పదోన్నతి పై వెళుతున్న సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, యకాంబరం, మరియు కానిస్టేబుళ్లు డి శ్రీనివాస్, భాస్కర్, రాజేందర్, శివకుమార్ ,శ్రావణ్ నాయక్, సోమేశ్వర్,లను స్థానిక పోలీస్ స్టేషన్లో శాలువాలతో పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సన్మాన నిర్వహించిన ఎస్సైలు సాయి ప్రసన్నకుమార్ &లింగారెడ్డి.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది నరేష్, ప్రశాంతి, యాకన్న, రాజ్ కుమార్, కుమారస్వామి తదితరులు కానిస్టేబుల్ పాల్గొన్నారు


TEJA NEWS