TEJA NEWS

చిట్కుల్ లో మొదలైన దుర్గమ్మ జాతర…
మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు..
మొదటిరోజు కట్ట మైసమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న నీలం మధు ముదిరాజ్..

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆషాడ మాసంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న దుర్గమ్మ ఉత్సవాలు చిట్కుల్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి.
మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాల్లో మొదటిరోజు కట్ట మైసమ్మ దేవాలయంలో భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.
మొదటి రోజైన మంగళవారం కట్ట మైసమ్మ దేవాలయంలో అమ్మవారిని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం దుర్గమ్మ దేవాలయానికి చివరి రోజు గురువారం పోచమ్మ దేవాలయంలో భక్తులు బోనాలు సమర్పించనున్నారు.
బుధవారం సాయంత్రం ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో పలహారం బండి వేడుకలను నిర్వహించేందుకు నీలం మధు అభిమానులు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS