TEJA NEWS

లంకెలపాలెం జంక్షన్లో చిరు జన్మదిన వారోత్సవాలు ప్రారంభం

ఈనెల 22వ తారీకు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా లంకెలపాలెం చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో మెగాస్టార్ 69వ జన్మదిన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటి రోజు 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని 5కె వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందల రమణ చిరంజీవి అభిమానులకు చిరు ఫోటోతో ఉన్న టీ షర్ట్లు మరియు టోపీలను అందజేశారు. అనంతరం లంకెలపాలెం జంక్షన్ నుండి అగనంపూడి వరకు సాగే 5కె వాక్ కార్యక్రమాన్ని రౌతు శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చిరు అభిమానులతో పాటు రౌతు శ్రీనివాస్ లంకెలపాలెం జంక్షన్ వరకు నడిచి వారితో పాటు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు అభిమానులు వారం రోజులు పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చిరు అభిమానులు అంటేనే క్రమశిక్షణతో ఉంటారని, ఈ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మడక రమేష్ నాయుడును అభినందించారు. అనంతరం ఇందల రమణ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ ప్రపంచ స్థాయి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, వారికి ఆంధ్రాలోనే కాకుండా ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారని అన్నారు. అనంతర ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ చిరు జన్మదిన వారం రోజులు పాటు వివిధ సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా చిరు గౌరవాన్ని పెంచిన వారవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాసు వాసుదేవరావు, గొల్లవిల్లి నాగరాజు, గంజి సురేష్, బంతికోరు గోవిందరాజు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, గైపూరి భాస్కరరావు, తురసాల శ్రీనివాసరావు, కల్లేపల్లి శంకర్, మేడిశెట్టి జానకిరామ్, రాఘవాపురపు శ్రీనివాస్ కుమార్, జుత్తక రాము, మడక వీరాస్వామి, కోరుకొండ అప్పారావు,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS