TEJA NEWS

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు భేటీలో పాల్గొన్నారు. బొంతు రామ్మోహన్‌ భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్టు సమాచారం.


TEJA NEWS