TEJA NEWS

ఆదిపురుష్’ న‌టి ఆశా శ‌ర్మ క‌న్నుమూత‌

హైదరాబాద్:
సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ న‌టి ఆశా శ‌ర్మ సాయంత్రం క‌న్నుమూసింది.

ఆమె వ‌య‌సు 88 సంవ‌త్స‌ రాలు. ఆమె మృతికి గ‌ల కార‌ణాలు వెల్ల‌డికాలేదు. ఆమె మ‌ర‌ణించిన విష‌ యాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ధ్రువీక‌ రించింది. మ‌రో నటిని ప‌రిశ్ర‌మ కోల్పోయిందని చెప్పుకొచ్చింది.

ఆమె కుటుంబానికి సంతాపం తెలియ‌జేసింది. బుల్లితెర‌పై ఆశా శ‌ర్మ ఎక్కు వ‌గా పేరు సంపాదించుకు న్నారు. ‘కుంకుమ్ భాగ్య’ సీరియ‌ల్ ఆమెకు మంచి పేరు తీసుకువ‌చ్చింది.

సీరియ‌ల్స్‌లోనే కాకుండా ప‌లు చిత్రాల్లోనూ ఆమె న‌టించింది. ఎక్కువ‌గా త‌ల్లి, అమ్మ‌మ్మ పాత్ర‌ల్లో న‌టించింది.దో దిశయాన్’, ‘ముఝే కుచ్ కెహనా హై’, ‘ప్యార్ తో హోనా హి థా’, ‘హమ్ తుమ్హారే హై సనమ్’ వంటి మూవీల్లో న‌టించింది.

1982లో హేమమాలిని, ధర్మేంద్ర నటించిన ‘దో దిశాయేన్’ చిత్రంలో శ్రీమతి నివారణ్ శర్మ పాత్రను ఆశా పోషించింది. ఈ చిత్రంలో ఆమె న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఆశా శర్మ చివరిసారిగా ప్రభాస్, కృతి సనన్‌లు న‌టించిన‌ ఆదిపురుష్‌లో కనిపించింది. ఈ మూవీలో శబరి పాత్రను ఆశా శర్మ పోషించింది. ఈ మూవీలో క‌నిపించేది త‌క్కువ సేపే అయినా కూడా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.


TEJA NEWS