TEJA NEWS

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. BRS MLA పాడి కౌషిక్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి జరిపిన నేపథ్యంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో ముందస్తు చర్యలలో భాగంగా మారేడ్ పల్లి CI నోముల వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. తన హెల్త్ బాగోలేదని, డాక్టర్ వద్ద అపాయింట్ మెంట్ ఉన్నదని వెళ్లాలని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించినా పోలీసులు వినలేదు…కారు ఎక్కకుండా అడ్డుకున్నారు. దీంతో MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దాడులు, ప్రతిదాడులు ప్రజాస్వామ్యంలో సరైనవి కావన్నారు. దాడులు చేయడం, రెచ్చగొట్టడం వంటి చర్యలతో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించవద్దని అన్నారు. సమస్యకు పరిష్కారం చూడకుండా అరెస్ట్ లు, అడ్డుకోవడాలు తగదన్నారు. శాంతిబద్రతలకు విఘాతం కల్పిస్తే హైదరాబాద్ నగర ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. హౌస్ అరెస్ట్ అయిన వారిలో MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు రాంగోపాల్ పేట, మోండా మార్కెట్ డివిజన్ BRS పార్టీ అద్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, కిషోర్ తదితరులు ఉన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలువురు BRS పార్టీ నాయకులను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.


TEJA NEWS