TEJA NEWS

కౌశిక్ రెడ్డి పై అసెంబ్లీ స్పీకర్ కు కాంగ్రెస్ మహిళ నేతల ఫిర్యాదు

హైద‌రాబాద్:
రాజకీయపరంగా అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డికి, ఏమైనా గొడవలు ఉంటే మీరు మీరు చూసు కోండి, కానీ మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదని, కాంగ్రెస్ నేతలు శోభారాణి, కాలువ సుజాత హెచ్చరించారు.

తెలంగాణ మ‌హిళ‌ల‌ను అగౌర‌వ‌ప‌రిచే విధంగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ని స‌స్పెండ్ చేయాల‌ని కోరుతూ కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు అసెంబ్లీ స్పీకర్ ప్ర‌సాద్ కుమార్ కు నేడు పిర్యాదు చేశారు.

మహిళలను కించపరిచేలా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారంటూ తమ ఫిర్యాదులో పేర్కొ న్నారు.ఈ మేర‌కు నేడు స్పీకర్ ను కలిసి పిర్యాదు పత్రాన్ని అందజేశారు..
అనంత‌రం మహిళా నేతలు మాట్లాడుతూ..

కౌశిక్ రెడ్డిని వెంటనే డిస్‌క్వాలిఫై చేయకుంటే సమాజంలో మహిళలకు మరింత అవమానం జరిగే ప్రమాదం ఉందని అన్నారు.. కాగా ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు చీర కట్టుకొని, గాజులు తొడుక్కోవా లంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే…


TEJA NEWS