TEJA NEWS

పెద్దపెల్లి జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన

ఏర్పాట్లను పరిశీలిస్తున్న రామగుండం సిపి పెద్దపల్లి జిల్లా కలెక్టర్

పెద్దపల్లి జిల్లా :
పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం తెలం గాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు ధర్మారం, జూలపల్లి, పెద్దపల్లి మండలాల్లో పలు సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉపముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

ఈ మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమ య్యారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ధర్మారం మండలంలో ఏర్పాట్లను పరిశీలించారు.

హెలిఫ్యాడ్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


TEJA NEWS