TEJA NEWS

ఊరికి వెళ్లే వారు జర భద్రం

సీఐ రవికుమార్

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఊరు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హన్మకొండ కేయూసీ సీఐ రవికుమార్ తెలిపారు. ఇంట్లో విలువైన వస్తువులు నగదును జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. ఊరెళ్లే ముందు స్థానికులకు, పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు. కాలనీలలో గుర్తు తెలియని వ్యక్తులు అనుమాన స్పదంగా సంచరిస్తే 100 కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు.