మేడిగడ్డకు వెళ్తూ ఇవి కూడా చూడండి: హరీష్ రావు
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ మేడిగడ్డ సందర్శనకు బస్సుల్లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ కు కీలక సూచన చేశారు.
మేడిగడ్డకు వెళ్తున్న సీఎం, మంత్రులు మధ్యలో రంగ నాయక్ సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్, గలగలా పారుతున్న కూడవెల్లి వాగును కూడా చూడాలని అన్నారు.
అయితే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిదో రోజు మంగళవారం సభ ప్రారంభమైన తరువాత మేడిగడ్డ బ్యారేజీలో అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాం. కేసీఆరే ముందుండి ఈ ప్రాజెక్ట్ గురించి వివరిస్తే బాగుంటుంది. బస్సుల్లో రావడం ఇబ్బందైతే హెలికాప్టర్‌లో రావచ్చు. కేసీఆర్ కోసం హెలికాప్టర్ కూడా సిద్ధం చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారు’ అని సీఎం అన్నారు.