నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ ను ఆహ్వానించింది. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సితాఫలమండీ ఎం.ఎల్.ఏ. కార్యాలయంలో పద్మారావు గౌడ్ కు సంఘం నేతలు తోడుపునురి విశ్వేశ్వర్ రావు, విశ్వ జ్యోతి లు అందించారు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, తన వంతు సహకారాన్ని అందిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మహిళా బాక్సర్ కు సత్కారం :
ఇటీవల జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ లో బంగారు పతాకాన్ని సాధించిన సయ్యద్ అయేషాను సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ అభినందించారు. సయ్యద్ అయేషా, ఆమె కోచ్ మనోజ్ రెడ్డి సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంప్ కార్యాలయంలో పద్మారావు గౌడ్ ను కలుసుకున్నారు. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.