సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్
వనపర్తి : * వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు రాయగడ్డ కు చెందిన పదిమంది వివిధ అనారోగ్యాల కారణాల చేత చికిత్సలు చేయించుకోవడం జరిగింది వీరందరూ అదే వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ చుక్క రాజు స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని అభ్యర్థించగా ఎమ్మెల్యే సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయించడం జరిగిందని ఆయన కృషి వల్లే దరఖాస్తు చేసుకున్న లబ్ధి దారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లు విడుదల అయ్యాయని ఎమ్మెల్యే, చుక్క రాజుల అభ్యర్థన మేరకు శనివారం వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్ పుట్టపాకల మహేష్ వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ల చేతుల మీదుగా లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లు విడుదల కావడానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యేకు అందుకు సహాయం చేసిన మాజీ కౌన్సిలర్ చుక్క రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సమయంలో ఆర్థికంగా సహాయం చేయడం తమ కుటుంబాలకు అండగా ధైర్యంగా ఉందని లబ్ధిదారులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోఒకటో వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోయ మురళి,దేవన్న నాయుడు వంశముని మోహన్,ఆర్ టి కిరణ్ జెటి నరేష్, మండ్లయాది, మండ్ల నరసింహనాయుడు, బీసీ యాదవ్ మోహన్ రాజ్ సూగూరు భాస్కర్ సి చందు ఏటీఎం మహేష్ చుక్క చింటూ లబ్ధిదారులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.