TEJA NEWS

ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్

కమలాపూర్ :
సామాన్య పేద ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటు సామజిక సేవా దృక్పధంతో స్నేహ సేవా ఫండేషన్ పని చేస్తoదాని వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు.హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల పరధిలో కానిపర్తి గ్రామంలో దాసరి బిక్షపతి s/o. ముత్తయ్య వయసు 45 సంవత్సరాలు ఇటీవల మృతి చెందాడు. అతని కుటుంబానికి స్నేహ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతని ఇద్దరు కుమార్తెల పేరుపై రూపాయలు సుకన్య సమృద్ధి యోజనా పథకంలో పదివేల రూపాయలు డిపాజిట్ చేశారు. అనంతరం 50 కేజీల బియ్యం అందజేశారు.

ఈ కార్యక్రమానికి దాతలు వ్యవహరించిన వారు స్నేహ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండువేల రూపాయలు, స్నేహసేవా ఫౌండేషన్ వర్కింగ్ అధ్యక్షులు జనగాని సుమన్ గౌడ్ రెండువేల రూపాయలు,ప్రధాన సలహాదారులు మాటూరి రమణాచారి వేయిరూపాయలు ఫౌండేషన్ అధ్యక్షులు పాగాల నరేందర్ రెడ్డి పదిహేనువందల రూపాయలు, ఫౌండేషన్ అధ్యక్షులు తొగరి హనుమయ్య రెండు వేలఐదు వందల రూపాయలు, ప్రసాద్ రెండువేల ఐదు వందల రూపాయలు,సంయుక్త కార్యదర్శులు జనగాని కుమారస్వామి ఒక వేయి రూపాయలు, ఉపాధ్యక్షురాలు మాదిరెడ్డి సంధ్యారాణి ఐదు వందల రూపాయలు, తొగరి అశోక్ ఐదు వందల రూపాయలు, సన్నపు రాంబాబు ఐదు వందల రూపాయలు, సన్నపు, సూరయ్యఐదు వందల రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శులు కోడిగుటి చేరాలు, జనగాని రమేష్, పెండెం ఉమారాణి, సన్నపు పద్మ ,మీడియా కో ఆర్డి నెటర్ కతేర్ల క్రాంతి కుమార్ ప్రచారకార్యదర్శులు జనగాని అశోక్, బాడీ ఫ్రీజర్ కో ఆర్డి నెటర్ యాలాల ఎల్లస్వామి, సన్నపు కళావతి, తొగరి రేఖ, సన్నపు రాజయ్య, సన్నపు సురేందర్, కుమార్,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS