హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కృష్ణవేణి కాలనీ గాంధీ విగ్రహం వద్ద మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా జాతి పిత బాపూజీ మహాత్మ గాంధీ 155 వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని, గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, జాతిపితకు ఘన నివాళ్లు అర్పించి, గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియచేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ రోజు ను అహింస దినోత్సవం కూడా అని పేర్కొనడం జరిగినది అహింస మార్గం లో గాంధేయమార్గం లో దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్ముడు గాంధీ అని చెప్పడం జరిగినది చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత దేశం నుండి పారదోలి దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహానుభావుడు గాంధీ అని చెప్పడం జరిగినది. ఈ రోజు స్వాతంత్రం అనుభవిస్తున్నామంటే అది ఆ మహాత్ముడి కృషి ఫలితమే అని సత్యాగ్రహం, అహింస, నిజాయితీ వంటి మార్గాలను ఎంచుకొని అటువైపుగా ప్రజలను భాగస్వామ్యం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొనడం జరిగినది. మహాత్ముడు చూపిన బాటలో అందరు నడవాలని, గాంధీ చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలి అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పిలుపునివ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో నాయకులు పోతుల రాజేందర్, కుమార స్వామి, శేఖర్ పటేల్, కుమార్ యాదవ్, నిరంజన్ గౌడ్, స్వామి, మల్లేష్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, దను, రఘు యాదవ్, పద్మ నరేష్, జక్క నరేష్, మల్లేష్, శ్రీనివాస్ గౌడ్, శ్రీను, గోపాల్, సుధాకర్, రమేష్, నిఖిల్, మహిళలు శృతి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.