30 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి ర్యాండముగా బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహించాల నీ ఆదేశించిన ……. కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి
జిల్లాలో
30 సంవత్సరాల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికీ ర్యాండం బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
శుక్రవారం ఉదయం అప్పాయపల్లి గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న డయాబెటిస్ వైద్య పరీక్షల ప్రక్రియను కలక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ఒకే గ్రామాన్ని తీసుకున్నప్పటికీ త్వరలో మరో వంద గ్రామాల్లో డయాబెటిస్ పరీక్షలు ప్రారంభించి డయాబెటిస్ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ సరైన మందులు ఉచితంగా అందించాలని డిప్యూటీ డి.యం.అండ్ హెచ్ ఒ సాయినాథ్ రెడ్డి ని ఆదేశించారు. తినక ముందు ఒకసారి, తిన్న తర్వాత మరోసారి ర్యాండం గా రక్త పరీక్షలు నిర్వహించాలని అందువల్ల ఉదయాన్నే వైద్య పరీక్షలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 30 సంవత్సరాల వయస్సు దాటిన వారందరికీ డయాబెటిస్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న వనపర్తి మున్సిపాలిటీ 10వ వార్డు, అంజనగిరి గ్రామ పంచాయతీలలో సర్వే త్వరగా పూర్తి చేయాలని బృంద సభ్యులను ఆదేశించారు.
ఉదయాన్నే అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీఓ పి. రాఘవ, డిప్యూటీ వైద్య ఆరోగ్య అధికారి సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ రాంచందర్ రావు, పరిమళ తదితరులు కలక్టర్ వెంట ఉన్నారు.