TEJA NEWS

మాజీ కేంద్ర మంత్రి కీ.శే గడ్డం వెంకట స్వామి జయంతి వేడుకలు
ధర్మపురి
సందర్బంగా వెల్గటూర్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కాకా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.*

ఈ సందర్భంగా మాట్లాడుతూ..

పెద ప్రజలకు అండగా ఉండి అట్టడుగు వర్గాల ప్రజల ఉన్నతికి నిరంతరం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి కాకా గారని,ఆనాటి తెలంగాణ తొలి ఉద్యమంల్లో బుల్లెట్ గాయాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం గొంతు విప్పిన మహనీయుడనీ,సోనియా గాంధీ ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటనలో ప్రముఖ పాత్ర వహించడం జరిగిందని,సింగరేణి నష్టాల్లో ఉందని దాన్ని ముసివేయడానికి ప్రయత్నిస్తుంటే కేంద్రంతో మాట్లాడి దానికి అవసరమైన నిధులను విడుదల చేయించి సింగరేణి కార్మికులకు ఆదుకున్న గొప్ప వ్యక్తి అని,పెద్ద పెల్లి జిల్లాకు సంబంధించి ఇరిగేషన్,పరిశ్రమ,వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో కాకా పాత్ర మరువలేనిదని,ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కాకా ఆశీర్వాదంతోనే అని,వారి కుమారుడు వివేక్ ,మనుమడు వంశి అన్ని విషయాల్లో ప్రత్యేకంగా ధర్మపురి నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని,నేను అసెంబ్లీలో అడుగు పెట్టేటప్పుడు కూడా కాకా విగ్రహానికి పూలమాల వేసి వారిని స్మరించుకుని అసెంబ్లీకి వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS