కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు.
చేవెళ్ల మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో పారిశుద్ధ కార్యాలయంలో పనిచేసే కందవాడ సాయన్న కూతురు కందవాడ హిందు కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ లో ఫ్రీ సీటు సంపాదించింది. ఈ సందర్భంగా చేవెళ్ల లోని న్యాయవాదులు ఆమెకు సన్మానం చేశారు. ఈ సందర్బంగా హిందు మాట్లాడుతూ పెద్ద కాలేజీలో సీటు రావడం చాలా సంతోషంగా ఉంది అని, నేను ఈ సీటు సంపాదించడానికి నా చదువుతోపాటు మా అమ్మ నాన్నల కృషి కూడా ఎంతో ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జనార్ధన్, రాజశేఖర్, కుమార్, రవీందర్,మల్లేష్,రవీందర్, సురేందర్,ఆనంద్ మరియు ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.