TEJA NEWS

మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్ ఐస్ క్రీమ్ పార్లర్ డ్రై ఫ్రూట్ షాప్ ను ప్రారంభించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి పోలీస్ స్టేషన్ పక్కన శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్ ఐస్ క్రీమ్ పార్లర్ డ్రై ఫ్రూట్ షాప్ ను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ యువత తమకు నచ్చిన రంగంలో కష్టపడి పైకి రావాలని స్పీకర్ అన్నారు. షాపు యజమాని సామ మల్లారెడ్డిని స్పీకర్ అభినందించారు. షాపు యజమాని మల్లారెడ్డి స్పీకర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. మండల, మున్సిపల్ వివిధ పార్టీల నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.


TEJA NEWS