మళ్లీ రోడ్డెక్కిన పోలీసు భార్యలు : సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి కేటీఆర్
నిజామాబాద్ జిల్లా:
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి ఏడో బెటాలియన్ లో కానిస్టేబుల్ భార్యలు గురువారం రోడ్ ఎక్కారు .44 జాతీయ రహదారిపై వారు నిరసన చేపట్టారు.
తమ భర్తల సమస్యలను పరిష్కరించాలంటూవారు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పోరు బాటకు వెళ్తన్నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను పోలీసుల భార్యలు అడ్డుకున్నారు.
తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ను వేడుకున్నారు. అంశాన్ని అసెంబ్లీలో చర్చిస్తామని.. తప్పకుండా న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.
పోలీసుల భార్యల ధర్నాతో నిజామాబాద్-కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పాలనలో ఎవరూ సంతోషంగా లేరని కేటీఆర్ విమర్శించారు..