TEJA NEWS

కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు దక్కాలి :బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాఎస్

శంకర్పల్లి : సాక్షిత 30 సంవత్సరాలనుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేసిన మా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ పోస్టులు లేకుండా BRS, BJP,TDP పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి అదిష్టానం ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి మార్కెట్ కమిటీ పదవులను కట్టపెట్టడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలసి ఖండించాల్సిన విషయం అని శంకర్పల్లి మున్సిపాలిటీ బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు .ముందుగా అనుకున్న వ్యక్తుల పేర్లను తొలగించి లోపాయికారి ఒప్పందాలతో అనుకులమైన వారి పేర్లను చేర్చి నామినేటెడ్ పదవులను కట్టపెడితే స్థానికంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎన్నో సంవత్సరాలనుండి పార్టీ ఓడినా, గెలిచినా కాంగ్రెస్ పార్టీ కోసం అలుపెరుగని పోరాటం చేసిన మా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను చిన్న చూపుతో చూసి పెద్ద తప్పు చేస్తున్నారు.
కాగితపు పులులకు విలువనిస్తూ, కష్టపడిన కార్యకర్తలను విస్మరిస్తే పార్టీ మనుగడ కష్టమవుతుందని అదిష్టానం గమనించాలి.కష్టపడి గెలిపించుకున్న మా ప్రభుత్వంలో అవకాశాలకోసం చేరిన వారు అదికారం చాలాయిస్తే ఇక నుండి ఊరుకోము అని అన్నారు .


TEJA NEWS