TEJA NEWS

ప్రజలకు ఉపయోగ పడే ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టాలి

సూర్యాపేట రూరల్: ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగ పడే ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టాలని 10వ వార్డు ప్రజలు కోరారు. యాదవ కాలనిలో ట్యాంక్ పక్కన వార్డులో ఉన్న ప్రభుత్వ స్థలంలో గ్రామానికి చెందిన సుతారి యూనియన్ భవన నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేయగా తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలలో పిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్ఐ గోపి స్థలంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి పంచనామా చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు ఉపయోగ పడేలా బస్తీ దవాఖాన, గ్రంథాలయం, ఓపెన్ జిమ్, పార్క్ లాంటి నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరారు.

ఈ విషయాన్ని అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవాలన్నారు. ముందుగా స్థలాన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలనే ఒప్పంద పత్రంపై రెవిన్యూ అధికారుల సమక్షంలో గ్రామస్తులు సంతకం చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ సిబ్బంది కొత్త మధు, రఫీ గ్రామస్తులు కోడి నాగరాజు, చెరుకుపల్లి నాగరాజు, ఉపేందర్, లోడంగి నాగరాజు, దాసరి శంకర్, మామిళ్ళ నాగరాజు, టంగుటూరి నాగమ్మ, బొల్లం రాము, చెరుకుపల్లి తిరుపతమ్మ, లయరి మల్లమ్మ తదితరులు ఉన్నారు.


TEJA NEWS