ఆర్జేసి విజయ పరంపర ను కొనసాగించండి
-ఇష్టపడి చదివితే దేనినైనా సాధించ వచ్చు
-గుండాల కృష్ణ
ఘనంగా ఆర్జేసి డిగ్రీకళాశాల ఫ్రె షర్స్ డే వేడుకలు
ఉమ్మడి ఖమ్మం
ఖమ్మం నగరంలోని ట్రంక్ రోడ్ ప్రాంతం లో గల ఆర్జేసి డిగ్రీ కళాశాల గత 25 సంవత్సరాలు గా కొనసాగిస్తున్న విజయాల పరంపరను ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులు కూడా కొనసాగించాలని కళాశాల చైర్మన్, ప్రముఖ విద్యా వేత్త గుండాల కృష్ణ పిలుపు నిచ్చారు. కళాశాల డిగ్రీవిద్యార్థుల ఫ్రెషర్స్ డే పార్టీ వేడుకలు శని వారo స్థానిక ఎం.బి. గార్డెన్స్ ఫంక్షన్ హాలులో ఉత్సాహ పూరిత వాతావరణం లో విద్యార్థుల కేరింతల నడుమ ఉల్లాసం గా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం మంచి ఉద్దేశ్యం తో ప్రారంభించ బడిన ఆర్జేసి కళాశాల అనేక విజయాలు సాధించిoదని తెలిపారు.తమ కళాశాలలో విద్యను అభ్యసించి సైంటిస్టులు గా, బ్యాంకర్లు గా ప్రభుత్వ ఉద్యోగులు గా, క్రీడాకారులుగా, కళాకారులుగా దేశ, విదేశాల్లో స్థిర పడిన వారు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. ఇది తమకు గర్వకారణం ఆని పేర్కొన్నారు.అదేవిదంగా వరుసగా రెండు సంవత్సరాల పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. అంతే కాకుండా తమ కళాశాలలు సామాజిక కార్య క్రమాలలో కూడా అగ్రభాగాన ఉంటాయన్నారు.
ఈ అంశాలకు అంకిత భావం, అనుభవం ఉన్న తమ అధ్యాపకులే కారణమన్నారు.విద్యార్థులు చదువును ఇష్టపడి చదివితే దేనినైనా సాధించ వచ్చు అని అన్నారు.పేదరికం, తెలివి చదువుకి అడ్డు కానే కాదు అన్నారు. నిరుపేద కుటుంబాలలో, తెలివి తక్కువ గా ఉన్న ఎంతోమంది విద్యార్థులు ఐఎఎస్ లుగా,ఇతర ఉన్నత అధికారులు గా స్థిర పడ్డారని తెలిపారు.దీనికి పట్టుదల తో కూడిన కృషే కారణమని తెలిపారు. ప్రస్తుత సంవత్సరoవిద్యా ర్ధులు కూడా ఆ ఒరవడి ని కొనసాగించి జీవితంలో స్థిర పడి తల్లిదండ్రుల కలలు నెరవేర్చే వారీగా తయారు కావాలని సూచించారు. విద్యార్థులు చదువుకునేందుకు తన సహాయ సహకారాలు ఎల్ల వేళలా ఉంటాయని స్పష్టం చేశారు.దీనిలో భాగంగా పలువిభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.చివరగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన క్లాసికల్, వెస్టన్,బ్రేక్,గ్రూప్, సోలో తదితర డ్యాన్సులు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఆర్జేసి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.లింగయ్య,జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. లక్ష్మీపతి,ఇంచార్జీ ఆంజనేయులు,ఎస్.బి. ఐ.టి. కలాశాల అకడమిక్ డైరెక్టర్ ఏ .వి.వి.శివప్రసాద్, అధ్యాపకులు సునంద తదితరులు పాల్గొన్నారు…