అనారోగ్యానికి గురైన జర్నలిస్టుకు అండగా టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు
సొంతంగా రూ : 50 వేలు సమకూర్చిన ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కొండన్న యాదవ్
జర్నలిస్టు శ్రీనివాసులు చారి కుటుంబ సభ్యులకు అందజేసిన ఐజేయు నాయకులు
వనపర్తి :
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రానికి చెందిన నమస్తే తెలంగాణ జర్నలిస్టు సూరంపల్లి శ్రీనివాసచారి లివర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జి అయి కొత్తకోటలోని ఇంటిదగ్గర కోలుకుంటున్నాడు. తీవ్ర అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో శ్రీనివాసులు కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుసుకున్న టి యు డబ్ల్యూ జే ఐ జేయు ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కొండన్న యాదవ్ తన స్నేహితులకు జర్నలిస్టు శ్రీనివాసులు ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితి గురించి వివరించగా వారు స్పందించి కొంత డబ్బు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
వారు ఇచ్చిన డబ్బుతో పాటు సొంతంగా మరికొంత డబ్బును ఇచ్చేందుకు కొండన్న యాదవ్ ముందుకు వచ్చాడు . మంగళవారం యూనియన్ నాయకులు కొత్తకోట లోని జర్నలిస్టు శ్రీనివాసులు చారి ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం శ్రీనివాసులు చారి భార్య ప్రభావతికి 50 వేల రూపాయల నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జే యు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఉమ్మడి జిల్లా ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంచార్జ్ రవీందర్ రెడ్డి. స్టేట్ కౌన్సిల్ సభ్యులు సాక్షి జిల్లా ఇన్చార్జి బోలె మోని రమేష్. మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పోలిశెట్టి బాలకృష్ణ. కొంతం ప్రశాంత్. సీనియర్ జర్నలిస్టు శ్యాంసుందర్ రెడ్డి. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నవీన్ గౌడ్ సీనియర్ జర్నలిస్టు వెంకట్ గౌడ్. జర్నలిస్టులు గోపాలకృష్ణ. పురుషోత్తం యాదవ్. రవీందర్ యాదవ్.