హోంగార్డు ఆఫీసర్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాం…
-పోలీస్ శాఖలో క్రమశిక్షణ, సమయపాలన చాల ముఖ్యం
-హోంగార్డు ఆఫీసర్ల ఆత్మీయ సమావేశంలో పోలీస్ కమిషనర్
ఉమ్మడి ఖమ్మం
పోలీసుశాఖలో విధులు నిర్వహించే హోంగార్డు ఆఫీసర్ల సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కళ్యాణ మండపంలో హోంగార్డు ఆఫీసర్ల
శాఖపరమైన సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ముఖముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంగార్డు ఆఫీసర్లను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…పోలీస్ శాఖలో కీలకమైన భాధ్యతలు నిర్వహిస్తున్న హోంగార్డు ఆఫీసర్ల సమస్యలను తన పరిధిలో చేయగల సమస్యలను వెంటనే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా రావలసిన ఇతర సమస్యలపై ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారిస్తామన్నారు.
శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు, విధినిర్వహణలో పోలీసులకు సహాయకారిగా ఉండే హోంగార్డు ఆఫీసర్లకు వ్యక్తిగత క్రమశిక్షణ, సమయపాలన చాల ముఖ్యమని అన్నారు. హోంగార్డులు తన దృష్టికి తీసుకొచ్చిన హాస్పిటల్ ట్రిట్మెంట్ లో రాయితీ, కాలేజ్ ఫీజులలో రాయితీల కోసం సంబంధిత యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారిస్తామని హమీ ఇచ్చారు.
పోలీస్ శాఖలో భాధ్యతయుతమైన విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆఫీసర్లు తమ సమస్యల పరిష్కారానికి సరైన మార్గంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో నిబంధనలు అతిక్రమించి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడవద్దని సూచించారు. హోంగార్డు విభాగం నియమ, నిబంధనలు ఈ సందర్భంగా వివరించారు. ఆనంతరం హోంగార్డు ఆఫీసర్ల విశ్రాంతి కోసం నిర్మిస్తున్న బ్యారక్ ను సందర్శించి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా హోంగార్డు ఆఫీసర్లు పోలీస్ కమిషనర్ కి విన్నతుల పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా
స్పందించిన పోలీస్ కమిషనర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తమని అన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, ఎస్బీ ఏసీపీ సాంబరాజు పాల్గొన్నారు.