TEJA NEWS

విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ సేవలు మరింత విస్తృతం
ప్రజలకు 24/7 అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్
సాంకేతికతను జోడించి సత్వర ఫిర్యాదుల పరిష్కారం
ఫిర్యాదులకై 1912 సంప్రదించండి .

టిజిఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో టోల్ ఫ్రీ సేవలను మరింత విస్తృత పరిచామని జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ. సాలీయా నాయక్ తెలిపారు .
కార్పొరేట్ కార్యాలయం నుండి టోల్ ఫ్రీ సేవలు నిర్వహించబడుతున్నాయని , జగిత్యాల సర్కిల్ విద్యుత్ వినియోగదారులకు ఈ టోల్ ఫ్రీ సేవలను సద్వినియోగ పరుచుకోవాలని తెలిపారు . సాంకేతికతను జోడించి సిబ్బందిని పెంచి టోల్ ఫ్రీ సేవలను మరింత పటిష్టపరిచామని తెలిపారు . టోల్ ఫ్రీ నంబర్ 1912 అని తెలిపారు .


ప్రతి ట్రాన్స్ఫార్మర్ పై టోల్ ఫ్రీ నంబర్ 1912 ను ముద్రిస్తున్నామని అన్నారు . ప్రజల్లోకి విస్తృతంగా ఈ టోల్ ఫ్రీ నంబర్ ను తీసుకువెళ్తున్నామని చెప్పారు . ట్రాన్స్ఫార్మర్ల ఫేయిల్యూర్లు , విద్యుత్ సరఫరాలో ఏటువంటి ఇబ్బందులు తలెత్తిన , బిల్లులో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్న , ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ , విద్యుత్ మీటర్ల మార్పు , అన్ని రకాల కొత్త సర్వీసుల మంజూరుకు సంబంధించిన పేరు మార్పు , క్యాటగిరి మార్పు , లోడ్ మార్పు తదితర సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1912 సంప్రదించి సేవలు పొందగలరని కోరారు .
ఇందులో భాగంగా విద్యుత్ వినియోగదారుడు ముందుగా 1912 కు ఫోన్ చేయగానే అట్టి ఫిర్యాదును స్వీకరించి, స్వీకరించిన ఫిర్యాదును నమోదు చేసి , నమోదు తాలూకు సమాచారాన్ని సంబంధిత అధికారికి వెళ్తుంది , అలాగే ఫిర్యాదు దారునికి మెసేజ్ రూపంలో సంబంధిత అధికారికి పంపడం జరుగుతుందని తెలుపుతారు. అట్టి ఫిర్యాదు ఆ అధికారి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారన్నారు. . 1912 పై వచ్చిన ఫిర్యాదులను ఉన్నత స్థాయి అధికారులు సమీక్షను నిర్వహించడం జరుగుతుందన్నారు .
సమీక్షా చేయడం వలన త్వరిత గతిన పరిష్కారం అవుతాయాని వివరించారు . వినియోగదారుల ఫిర్యాదులు సత్వర పరిష్కారం కావడానికి టోల్ ఫ్రీ నంబర్లు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు . వినియోగదారుల అభిప్రాయం కూడా తీసుకోబడుతుందని అన్నారు .


TEJA NEWS