TEJA NEWS

పిల్లల సంరక్షణకు పక్కా చర్యలు…..
-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ
విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీల ఏర్పాటు
పిల్లల సంరక్షణపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన అదనపు కలెక్టర్

ఉమ్మడి ఖమ్మం

పిల్లల సంరక్షణకు పక్కా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పిల్లల సంరక్షణపై తీసుకుంటున్న చర్యల గురించి సంబంధించిన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పిల్లల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తున్నట్లు, గత 3 నెలలుగా తీసుకున్న చర్యల వివరాల నివేదికను అధికారులు వివరించారు.


ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ జిల్లాలోని విద్యా సంస్థలలో మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి విద్యా సంస్థలో డ్రగ్స్ నిర్మూలన కోసం విద్యాశాఖ, సంక్షేమ శాఖ, వైద్యశాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో యాంటి డ్రగ్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఫోక్సో కేసుల వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పోక్సో కేసుల ఫైలింగ్, వైద్యుల నివేదికల సేకరణ పక్కాగా జరగాలని అన్నారు. జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు చిన్నారి కార్యక్రమ అమలుపై సర్కులర్ జారీ చేయాలని విద్యాశాఖ అధికారికి అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తే వారిని గుర్తించి వెంటనే పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. బాల్య వివాహాల నివారణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలనీ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, జిల్లా బీసి అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కెవిబి. రెడ్డి, స్కోప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ప్రసాద్, జాగృతి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS