చెగ్యం గ్రామ బొడ్రాయి సాక్షిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీనీ నెరవేర్చి చూపించాం.
ధర్మపురి
వెల్గటూర్ మండలంలోని చేగ్యం ముంపు బాధితులకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 18 కోట్ల రూపాయల నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను చేగ్యాం గ్రామంలోని స్థానిక రైతు వేదిక వద్ద లబ్దిదారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎంపి వంశి తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు సంబంధించి మిగిలిన 63 మంది లబ్దిదారుల నష్ట పరిహారానికి చెందిన చెక్కులను ఎంపి వంశి తో కలిసి పంపిణీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,ఇట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద తమ తాతల కాలం నుండి వస్తున్న భూములను ఈ ప్రాంత ప్రజలు కోల్పోవడం జరిగిందని,వారికి సంబంధించిన పరిహారం అందించే విషయంలో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ నాయకులు ఎన్నడూ పట్టించుకోలేదని,చెగ్యం గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించడంలో పెద్దలు కీ.శే కాక వెంకట స్వామి పాత్ర ఎంతో ఉందని,తాను జడ్పీ చైర్మన్ గా ఉండి వివేక్ ఎంపిగా ఉన్నప్పుడు ఇట్టి ప్రాంత విషయం పైన శ్రీధర్ బాబు దృష్టికి,ముఖ్యమంత్రి దృష్టికి పలు మార్లు తీసుకెళ్లడం జరిగిందని,బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ముంపు బాధితులు వారి పరిహారం కోసం చేసిన ప్రతి నిరసనలో, ధర్నాలో వారి వెంట మేము ఉన్నామని,తాను ఎన్నికల సమయంలో గ్రామ బొడ్రాయి సాక్షిగా దశల వారీగా బాధితులకు పరిహారం ఇప్పిస్తాం అని ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని,ఇంకా ఎవరికైనా అర్హత ఉండి పరిహారం అందని వారి ఉంటే వారికి కూడా పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు..
ఈ కార్యక్రమంలో జిల్లా RDO ,మండల అధికారులు,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు