TEJA NEWS

రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల ను ఘనంగా జరిపిన కాంగ్రెస్ నాయకులు

ధర్మపురి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలను వెల్గటూర్ మండల అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భారీ ఎత్తున పాల్గొని నినాదాలు చేస్తూ స్వీట్లు పంచుకుని బాణా సంచాకాల్చారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం
ఏడు లక్షల కోట్ల అప్పుచేసి, తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చినప్పటికీ, 10 సంవత్సరాల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని, కుట్రలు చేసినప్పటికీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరిని ఏకం చేసి పార్టీని గెలిపించారని,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం విజయవంతంగా కేవలం 11 నెలల్లోనే అమలు చేసి తెలంగాణ ను ప్రగతివైపు నడిపిస్తూ ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తున్న ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది అన్నారు. ఉన్నత విద్య చదివి కేవలం జడ్పిటిసి స్థాయి నుండి క్రమశిక్షణతో రాజకీయాలలో ఉన్నత స్థాయికి ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు


TEJA NEWS