TEJA NEWS

కేసీఆర్‌ సైలెంట్‌ వెనక మర్మమేంటి? రేవంత్ రెడ్డి మాటలు అర్థమేంటి?

హైదరాబాద్:
ఆయన మౌనం ఈయనకు కోపం తెప్పిస్తోంది. ఫాంహౌ స్‌లో ఉంటావా?..ప్రజల్లోకి రా అంటూ గులాబీ దళప తికి సవాల్‌ చేస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఓడగొడితే ప్రజల ముఖం చూడవా? అంటూ..ఇగోను టచ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ సవాల్‌ చేస్తున్నారు.

కేసీఆర్‌ మౌనం వెనక వ్యూహం ఉందా.? రేవంత్‌ మాటల్లో ఎత్తుగడ కనిపిస్తోందా.? కేసీఆర్ సైలెంట్‌గా ఉంటున్నారంటే ఏదో కథ ఉందని రేవంత్‌ ఆందోళన చెందుతు న్నారా.? లేక రెచ్చగొట్టి గులాబీ దళపతిని పబ్లిక్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారా.? అసలు తెలంగాణ గట్టు మీద సీఎం, మాజీ సీఎం లా ఎత్తు గడలు ఏమిటి?

గులాబీ దళపతి ఇగోను టచ్‌ చేసి ప్రయత్నం..
మొన్నటి వరకు గులాబీ దళపతి మౌనం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా కొనసాగింది. ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి మాటలు టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌గా మారుతోంది. ఏడాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తోన్న సభల్లో.. బీఆర్ఎస్‌ అధినేతను టార్గెట్‌ చేస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

ఏకంగా కేసీఆర్ అనే మొక్క ను మళ్లీ మొలవనివ్వంటు న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తానని చెప్పి ఓడిం చా..పార్లమెంట్‌ ఎన్నికల్లో గుండు సున్నా సీట్లే అని చెప్పా.. చేసి చూపించా.. మళ్లీ చెప్తున్నా బీఆర్ఎస్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వను రాసి పెట్టుకోండి అంటూ సవాల్‌ చేస్తున్నారు.రేవంత్ రెడ్డి…

అంతేకాదు దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ గులాబీ దళపతి ఇగోను టచ్‌ చేసి ప్రయత్నం చేస్తున్నారు సీఎం. కేసీఆర్‌ను రెచ్చగొట్టే ఎత్తుగడ..!మౌనంగా ఫామ్ హౌస్‌లో పడుకుంటే నీ సంగతి తేలవదనుకోకు..నీ ముందు తెలుసు..నీ వెనక తెలుసు..నీ ఉపాయం తెలుసు..ఉబలాటం తెలుసు అంటున్నారు. రేవంత్ రెడ్డి..

మొన్నటి వరకు కేసీఆర్‌ ఎక్స్‌పైరీ మెడిసిన్‌ అన్న రేవంత్‌..ఇప్పుడు ఒక్కసారిగా బీఆర్ఎస్ అధినేత టార్గెట్‌ చేసి మాట్లాడటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే కొన్నాళ్లుగా కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. అవసరమనిపిస్తే పార్టీ నేతలను ఫాంహౌస్‌కు పిలిచి మాట్లాడుతున్నారు.

ఈ మధ్యే పాలకుర్తి నుంచి పలువురు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన గులాబీ బాస్‌ ఎక్కడా రేవంత్‌ పేరు ప్రస్తావించలేదు. ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైంది.. ఫ్యూచర్‌ అంతా బీఆర్ఎస్‌దేనని చెప్పారు కేసీఆర్. రేవంత్‌ మాత్రం కేసీఆర్ చేసిన కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ తెలంగాణ ఏం కోల్పో యిందో చెప్పాలంటూనే.. పర్సనల్‌ అటాకింగ్‌కు దిగుతున్నారు.

దమ్ముంటే అసెంబ్లీకి రా అని సవాల్‌ చేయడం వెనక..కేసీఆర్‌ను రెచ్చగొట్టే ఎత్తుగడ ఉందన్న చర్చ జరుగుతోంది.వరంగల్ సభలో రేవంత్‌ చేసిన నాలుగు కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఫాంహౌస్‌లో మౌనంగా పడుకుంటే నీ సంగతి తెల్వదనుకోకు..నీ ముందు తెలుసు.. వెనక తెలుసు..నీ ఉపాయం, ఉబలాటం తెలుసు అన్నారు. కేసీఆర్ ఉపాయానికి తన దగ్గర విరుగుడు కూడా ఉందంటున్నారు రేవంత్ రెడ్డి..

అసలు కేసీఆర్ ఫాంహౌస్‌ లో ఏం చేస్తున్నారు? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అందరు అనుకుంటున్నట్లే మౌనంగా ఉంటూ కేసీఆర్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారా? కేసీఆర్ చేస్తున్న ఉపాయం ఏంటి? రేవంత్‌ మాటల్లో అర్థమేంటి.? ఇదే ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద హాట్‌ టాపిక్‌గా మారింది..


TEJA NEWS