TEJA NEWS

తేమశాతం వచ్చేంతవరకు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలి.

ఐకెపి నిర్వాహకులు రికార్డులు మొదలయ్యాయి ఎప్పటికప్పుడు నమోదు చేయాలి.

ఐకెపి కేంద్రాలను సందర్శించిన ఆత్మకూరు మండల ఎంఆర్వో వినోద్ కుమార్.

సూర్యపేట జిల్లా : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పోసిన రైతులు ప్రభుత్వం నిర్ణయించిన తేమశాతం వచ్చేంతవరకు ధాన్యాన్ని కచ్చితంగా ఆరబెట్టుకోవాలని అన్నారు. లేనిపక్షంలో మిల్లుల వద్దకు వెళ్ళిన తర్వాత ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని సూచించారు. అదేవిధంగా ఐకెపి నిర్వాహకులు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేయాలని ఆత్మకూరు ఎస్ మండల ఎమ్మార్వో వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు మండలం పాత సూర్యాపేట గ్రామ ఐకెపి కేంద్రాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన తేమశాతం వచ్చేంతవరకు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని నిర్వాహకులకు తెలిపారు. ఆయన వెంట ఆర్ఐ ప్రదీప్ రెడ్డి, ఏవో దివ్య, ఏఈఓ శివకుమార్, సిసి చందు, ఐకెపి నిర్వాహకులు అనుసూర్య తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS