TEJA NEWS

పేదింటి ఆడపడుచులకు పెద్దన్న సీఎం …

కళ్యాణ లక్ష్మి,/ షాదీమూరక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ధరూర్ మండల పరిధిలోని వివిధ గ్రామానికి సంబంధించిన కళ్యాణి లక్ష్మి/ షాదీమూరక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి * హాజరయ్యారు.

ధరూర్ మండల సంబంధించిన చెందిన 64మంది కి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి / షాదీమూరక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ చేతులమీదుగా చెక్కులను అందజేయడం జరిగినది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపడుచుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి పథకం పెళ్లిళ్లకు కానుకగా లక్ష 116 రూపాయలను అందించడం జరుగుతుంది.

కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కుల పేద ఇంటి ఆడపడుచులకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

కొందరు కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు అని ప్రజలకు అపోహ కల్పిస్తున్నారు అలాంటివి ఏమీ లేవు ప్రతి ఒక్కరు కళ్యాణ లక్ష్మి చెక్కులకు నమోదు చేసుకోవాలి ప్రతి ఒక్క మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీమూరక్ చెక్కులను అందిస్తామని అన్నారు.

గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు అధికార పార్టీలోని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో . భవిష్యత్తులో సీఎం సహకారంతో గతంలో గద్వాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాము భవిష్యత్తులో కూడా అదేవిధంగా మరింత అభివృద్ధి చేసుకునే విధంగా నా వంతు సహాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

మహిళలు ఈ కళ్యాణలక్ష్మి, డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి డి.ఆర్ శ్రీధర్, డి.వై రామన్న, మహబూబ్, ప్రభాకర్ గౌడ్, వీరన్న గౌడ్,దర్షెల్లి, శ్రీరాములు, రాఘవేంద్ర రెడ్డి,రంగస్వామి , నాగేంద్ర యాదవ్, నాగన్న కర్రెప్ప, గోవిందు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS