TEJA NEWS

సీసీ రోడ్డును పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు వద్ద ప్రధాన రహదారిలో నిర్మాణ పనులు పూర్తయిన నూతన సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా అంచుల వద్ద మట్టి వేయాలని, మంచిగా క్యూరింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అలాగే పెండింగ్ ఉన్న రోడ్ల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, రాజీ రెడ్డి, పోశెట్టి గౌడ్, వాలి నాగేశ్వరరావు, ఏ.ఇ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS