TEJA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, కమిషనర్ సాబేర్ అలి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి తో మర్యాద పూర్వకంగా కలిసిన ప్రగతి నగర్ ఆల్విన్ మాజీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,మరియు ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయిస్ డెత్ రిలీఫ్ ఫండ్ కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా ప్రగతి నగర్ వైకుంఠ ధామం ఏర్పాటు,సంబంధిత సౌకర్యాలు, మరియు మౌలిక వసతుల కల్పనకై కృషి చేయగలరని కోరారు.భాగంగా మేయర్ ,కమీషనర్ సానుకూలంగా స్పందిస్తూ మౌలిక వసతుల రూపకల్పనకు ఎల్లపుడూ కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ రెడ్డి,లక్ష్మీ కుమారి,ఎస్.ఈ సత్యనారాయణ,ఎసిపి జ్యోత్స్న, ఆయా విభాగాల అధికారులు,ఇతర ముఖ్యులు,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS