దేవాలయాలు, మసీదులు ,చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి: CI రాం నర్సింహారెడ్డి
ధర్మపురి
బుగ్గారం పోలీస్ స్టేషన్లో దేవాలయాలు, మసీదులు మరియు చర్చిల నిర్వహకులతో ఏర్పరిచిన సమావేశంలో సీఐ ధర్మపురి మాట్లాడుతూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని, అసాంఘిక కార్యక్రమాల గురించి వెంటనే సమాచార ఇవ్వాలని, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని మరియు సైబర్ నేరానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం ఎస్సై శ్రీధర్ రెడ్డి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.