సాయంపేట పాఠశాలకు వాటర్ ఫిల్టర్ వితరణ
ధర్మపురి
ధర్మారం మండలంలోని శాయంపేట ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన నాయకుడు కూష తిరుపతి మంగళవారం స్టీల్ వాటర్ ఫిల్టర్ ను అందజేశారు. పాఠశాలకు, విద్యార్థులకు ఉపయోగకరమైన వాటర్ ఫిల్టర్ అందించిన కూష తిరుపతికి ప్రధానోపాధ్యాయులు జాడి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ నరిగే ప్రమీల, సహోపాధ్యాయులు కాట నరసయ్య, అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి, ఆశవర్కర్ పద్మ, తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాల సిబ్బంది ఉన్నారు.