గురుకులంలో తనిఖీకి వెళ్లి ఖంగుతిన్న అడిషనల్ కలెక్టర్
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీకి వెళ్లిన అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ
వంట మనిషి లేకపోవడంతో రోజువారీ కూలీలతో వంట చేయిస్తున్న వైనం
స్టోర్ రూంలో కుళ్లి బూజు పట్టిన ఆలుగడ్డలు, ఐఎస్ఐ మార్క్ లేని ఉప్పు ప్యాకెట్లు దర్శనం
మెనూ ప్రకారం పప్పు వండాల్సి ఉండగా నీళ్ల సాంబార్ వండిన వంట కూలీలు
అడిషనల్ కలెక్టర్ వస్తున్నాడని కొన్ని గుడ్లు ఉడికించగా అవి కుళ్లిపోయిన పరిస్థితి
పిల్లలకు ఇప్పటివరకు యూనిఫాంలు ఇవ్వలేదు.. చలికాలం ప్రారంభమైనా ఇప్పటికీ బ్లాంకెట్లు అందలేదు
దీంతో గురుకులం తనిఖీలో విస్తూ పోయే నిజాలు చూసి ఖంగుతిన్న అడిషనల్ కలెక్టర్…