విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు !
శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు సూచనలతో
గుర్ల మండలం,గుర్ల గ్రామంలో ఇటీవల ప్రబలని అతి సారం పై త్వరితగతిన నివారణ చర్యలు తీసుకున్నందుకు కలెక్టరేట్ కి అభినందనలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు
ఈ సందర్భంగా రామ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ
చీపురుపల్లి నియోజకవర్గం,గుర్ల మండలంలో ఉన్న ప్రభుత్వం భూమి వద్ద ఇండస్ట్రీల్ కార్డిర్ ఏర్పాటుకు కృషి చేయాలని కలెక్టర్ ని రామ మల్లిక్ నాయుడు కోరారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంటనే స్పందించి గుర్ల మండల తహశీల్దార్ కి తగు సూచనలు జారీ చేస్తూ ప్రభుత్వం భూమి యొక్క నివేదిక ను తయారు చేయాలని ఆదేశించడం జరిగింది.
చీపురుపల్లి,గరివిడి మండలాల భక్తులు మరియు కూటమి నాయకుల కోరిక మేరకు తోటపల్లి కాలువ ద్వారా పోలి పాడ్యమి నాటికి నీరు విడుదల చేయడానికి కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా కలెక్టర్ గారు స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి నీటి విడుదల చేయడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు
చీపురుపల్లి నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ తో కిమిడి రామ మల్లిక్ నాయుడు చర్చించారు
చీపురుపల్లి నియోజకవర్గంలో గత వైకాపా ప్రభుత్వంలో మూతపడిన పలు కంపెనీలను తెరిపించే విదంగా చర్యలు తీసుకోవాలని అలాగే నియోజకవర్గంలో గతంలో ఏర్పడి ఉన్న పలు సమస్యలు గురించి కలెక్టర్ తో చర్చించారు,ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.