లఘు చర్ల లో భూసేకరణ రద్దు
వికారాబాద్ జిల్లా:
వికారాబాద్ జిల్లా లఘు చర్ల లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
లగచర్లకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. 580 మంది రైతుల నుంచి ఈ భూమిని సేకరించాలని 2024, ఆగస్టు 1న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నోటీఫికేషన్ ను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. దుద్యాల మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో పార్మా క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయం లో భాగంగా లగచర్లలో 632 ఎకరాల పట్టా భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించింది.
అయితే 580 మంది రైతులు గిరిజనులు. వీరికి ఎకరం, అర ఎకరం భూమి మాత్రమే ఉంది. పార్మా కంపెనీలకు భూమిని ఇచ్చేందుకు స్థానిక రైతులు అంగీకరించడం లేదు. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా భూములు ఇచ్చేందుకు అడ్డంకిగా మారింది. లగచర్లలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుపై ప్రజాభిప్రా యసేకరణను ఈ నెల 11న నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా ఇతర అధికారులపై లగచర్ల గ్రామస్తులు దాడికి యత్నించారు.
ఈ దాడి నుంచి కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారు లను పోలీసులు రక్షించారు. కడా అధికారి వెంకట్ రెడ్డిని స్థానికులు కొట్టారు. అడ్డుకున్న డీఎస్పీ పై కూడా స్థానికులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదే కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే.