డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ఘనంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల నిర్వహణ::జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ ..
()
డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం లో ఘనంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి ,సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
డిసెంబర్ 1న విద్యా శాఖ ఆధ్వర్యంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల రెండవ దశ నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తామని, పాఠశాల విద్యార్థులకు స్వీట్ల పంపిణీ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని, సీఎం కప్ పేరిట క్రీడ పోటీలు నిర్వహణ ఉంటుందని అన్నారు.
డిసెంబర్ 2న 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కళాశాలలను,213 నూతన అంబులెన్స్ , 33 ట్రాన్స్ జెండర్ ల క్లినిక్ లు ప్రారంభిస్తారని అన్నారు. డిసెంబర్ 3న హైదరాబాదులో నిర్మించిన అరంఘర్ నుంచి జూ పార్క్ ఫ్లై ఓవర్, 485 ఎం.ఎల్.డి సామర్థ్యం గల 6 ఎస్టిపి, 150 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులు, 17 కోట్లతో చేపట్టిన వర్షపు నీరు నిల్వ స్ట్రక్చర్స్ ప్రారంభిస్తారని, అదే సమయంలో కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ పనులు, 5942 కోట్లతో చేపట్టే హెచ్.సి.ఐ.టి.ఐ పనులు, 586 కోట్లతో చేపట్టే ఎస్.ఎన్.డి.పి పనులు శంకుస్థాపన జరుగుతుందని అన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం, మున్సిపల్ కార్మికులకు హెల్త్ క్యాంప్ ల నిర్వహణ, పారిశుధ్య సిబ్బందికి అవసరమైన సేఫ్టీ ఎక్విప్మెంట్, పిపిఈ పంపిణీ , అమృత పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు.
డిసెంబర్ 4న హైదరాబాదులో తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోనా నెక్ శంకుస్థాపన, వర్చువల్ సఫారీ థీం పార్క్, వృక్ష పరిచయ క్షేత్రం ప్రారంభిస్తారని, అదే రోజు సాయంత్రం పెద్దపల్లి జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి 9007 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. డిసెంబర్ 5న హైదరాబాద్ మాదాపూర్ లో మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవం, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం విజయాల పై శివశక్తి మహిళా సంఘాలలో చర్చ నిర్వహించాలని అన్నారు. డిసెంబర్ 6న ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం, 244 సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన ఉంటుందని అన్నారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాదులో ఘనంగా వేడుకలు జరుగుతాయని అన్నారు. డిసెంబర్ 7న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, విద్యుత్ శాఖకు నూతన ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు ప్రారంభిస్తామని అన్నారు. డిసెంబర్ 8న ఏఐ నగరానికి శంకుస్థాపన, 7 నూతన ఏఐ ఇన్నిసేటివ్, 130 నూతన పౌర సర్వీసులు, కమలాపురం ఫ్యాక్టరీ పునరుద్ధరణ మొదలగు 15 పరిశ్రమలతో ఎమ్ఓయూలు, స్పోర్ట్ యూనివర్సిటీ కు శంకుస్థాపన ఉంటుందని, డిసెంబర్ 9న హైదరాబాద్ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని లక్ష మంది మహిళల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.
ప్రజాపాలన ప్రజా దినోత్సవ కార్యక్రమాలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు