TEJA NEWS

రసవత్తరంగా మారిన మల్కాజిగిరి రాజకీయాలు

పోటాపోటీ ప్రెస్ మీట్ లతో ఘాటు వ్యాఖ్యలతో పరస్పర విమర్శలు

  కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్  నిర్వహించి  ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ని విమర్శించగా   బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు మల్కాజిగిరి లో ప్రెస్ మీట్ నిర్వహించారు. 
  ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ నాయకులు మాట్లాడుతూ   కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఎమ్మెల్యే ని విమర్శిస్తున్నారని నియోజకవర్గ  అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలియజేశారు.  

మల్కాజిగిరి లో రాజకీయాలు విపరీత ధోరణి లో నడుస్తున్నాయని దయచేసి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు.
ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి సరైన గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం సిగ్గు చేటని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేస్తుంటే ఆయనపై బురద జల్లుతున్నారని ఇది మంచి సంప్రదాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుల మాటలు విని అధికారులు గెలిచిన ఎమ్మెల్యే కి సహకారం అందించడంలేదని ఇది మంచి పద్ధతి కాదని అధికారులను హెచ్చరించారు.
నాయకులు పార్టీలకతీతంగా ప్రజల కోసం పోటీ పడి పనిచేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకోకూడదని తెలియజేసారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం పనిచేయకూడదా ప్రశ్నించారు.
ఎవరు అడ్డుకున్నా, తమకు అధికారులు సహకరించకున్నా తాము మాత్రం ప్రజల కోసం పని చేస్తామని ప్రజలకు తెలియజేసారు.


TEJA NEWS