TEJA NEWS

వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన

హైదరాబాద్:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా,ఆర్‌బీఐ, మరోసారి వడ్డీ రేట్లను యథాతథం గానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరగడం, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మరోసారి రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తు న్నట్లు వెల్లడించారు. 2023, ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు రెపో రేటును మార్పులు చేయకుండా యథాతథంగానే కొనసాగి స్తూ వస్తోంది. వడ్డీ రేట్లలో మార్పు చేయకపోవడం వరుసగా 11వ సారి కావడం గమనార్హం.

డిసెంబర్ 4, 2024 నుంచి మూడు రోజుల పాటు ఆర్‌బీఐ మానీటరీ పాలసీ సమీక్షా సమావేశం జరి గింది. ఇందులో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిం చేందుకు 4:2 రేషియోలో మద్దతు లభించినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈసారి స్థిర విధాన వైఖరిని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.

వీటితో పాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) సైతం 6.25 శాతం, మార్జి నల్ స్టాండింగ్ ఫెసిలిటి (MSF), బ్యాంక్ రేటు సైతం 6.75 శాతం వద్దే యథాత థంగా కొనసాగిస్తున్నామని తెలిపారు…


TEJA NEWS