TEJA NEWS

ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదు : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద గల 125 అడుగుల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమంతో పాటు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్టులను నిరసిస్తూ చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి బయలుదేరి వెళుతున్న కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ (గృహ నిర్భంధం) చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రజా ప్రతినిధులపై ప్రభుత్వం అవలంబిస్తున్న నియంతృత్వ ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తూ తమ పాలన ప్రజా పాలన అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుందని, కానీ ఆచరణకు సాధ్యం కానీ అబద్ధపు హామీలతో ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించలేరని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడాన్ని మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బిఆర్ఎస్ పార్టీ వదలబోదని, ప్రభుత్వం పాలనను మరిచి ప్రజలను మాయచేయాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.

ఎమ్మెల్యే గృహ నిర్భంధం విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.


TEJA NEWS