TEJA NEWS

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉష ముళ్ళపూడి రోడ్డు లోని ఇండియన్ బ్యాంక్ నుండి ఎల్లమ్మ చెరువు అలుగు వరకు రూ.2 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణం పనులను మరియు సీసీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన వరద నీటి కాల్వ నిర్మాణం పనులు పూర్తి చేశామని, వరద నీటి కాల్వ నిర్మాణం పనులు పూర్తి అయిన సందర్భంగా సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టడం జరిగినది అని, సీసీ రోడ్డు నిర్మాణం పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని,అవసరమగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని , పనులలో జాప్యం లేకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, త్వరలొనే అందుబాటులో కి తీసుకురావాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని, ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని, సీసీ రోడ్డు నిర్మాణం పనులలో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలనీ చెప్పడం జరిగినది. సీసీ రోడ్డు నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు తెలియచేసారు.

ఆల్విన్ కాలనీ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నా శాయశెక్తుల కృషి చేస్తానని, శేరిలింగంపల్లి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో AE శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి మరియు
యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, పాండు గౌడ్, జిల్లా గణేష్, శివరాజ్ గౌడ్, జి.రవి, మరేళ్ల శ్రీనివాస్, అష్రఫ్ , CH. భాస్కర్, గుడ్ల శ్రీనివాస్, యాదగిరి, అగ్రవాసు, బాలస్వామి, మల్లేష్, మోజెస్, ముజీబ్, మహేష్, నరసింహులు, రవీందర్, మజర్, బషీర్, ఖలీమ్, ఇంతియాజ్, సాయి, దనుంజయ్, ప్రసాద్, నరసింహులు, రాజు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS