యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎన్నికైన నాయకులు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజవర్గం లోని 132 జీడిమెట్ల డివిజన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన పులి సందీప్ గౌడ్ కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దమ్మని శ్రావణ్ కుమార్, జి బాలప్ప, డివిజన్ అధ్యక్షుడు బేకు శ్రీనివాస్, బండి శ్రీనివాస్ గౌడ్, పులి అనిల్, అంజి, మల్లారెడ్డి, పులి వినయ్, యాస్కి ప్రవీణ్, పులి భాస్కర్, సోను, చంద్రశేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.