TEJA NEWS

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్, కుత్బుల్లాపూర్ గ్రామంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు,ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దలు
కె.యం.ప్రతాప్ విచ్చేసి జన్మదిన కేకును కట్ చేసి,పేద ప్రజలకు పండ్లను పంచిపెట్టారు.
ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా,
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు, తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం మొట్టమొదటగా శ్రీమతి సోనియా గాంధీ పునాది వేశారన్నారు, సోనియా గాంధీ చొరవతో, ఆమె దేశంలో ఉన్నటువంటి మిత్రపక్షాలని ప్రతిపక్షాలని ఏకం చేసి, అందర్నీ ఒప్పించి ఏకాభిప్రాయంతోని తెలంగాణ ప్రజల యొక్క ఆశలకు, ఆకాంక్షలకు, త్యాగాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది,అది కేవలం సోనియా గాంధీ చలువ వల్లేనన్నారు,
ఆంధ్ర ప్రాంతంలో పార్టీ నష్టపోతుంది అని తెలిసి కూడా వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు సముచిత న్యాయం జరగాలని, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఇచ్చారన్నారు,
అన్ని మతాల, కులాల ప్రాంతాల ప్రజలందరి యొక్క ఆకాంక్షలను కూడగట్టుకుని తీసుకుపోయే పార్టీ, అది భారతదేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.


కులాలు వేరైనా, మతాలు వేరైనా అందరూ కలిసిమెలిసి జీవనం చెయ్యాలని ఆకాంక్షతో తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ అన్నారు,
తెలంగాణ ఆవిర్భావానికి గాని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి,అతి పెద్ద పాత్ర సోనియా గాంధీ ది అన్నారు, మొత్తం 544 ఎంపీలతో, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఏకతాటిపై తీసుకువచ్చి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది మహా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ అని అన్నారు, ఏ ఆశ ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో,
కాంగ్రెస్ కార్యకర్తలు, మనమందరము కూడా ఇకతాటిగా నిలిచి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను పేదప్రజలకు ఇప్పించాలన్నారు,
రాహుల్ గాంధీ , మల్లికార్జున కరిగే , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతనం చేసే దిశగా పనిచేయాలన్నారు , మనమందరం కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను,రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలను ముందుకు తీసుకుపోవాలన్నారు,
అదేవిధంగా ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు లబ్ధిదారులకు అందజేసే విధంగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బాబు మియా, మేకల ఎల్లయ్య, మైనార్టీ నాయకులు జలీల్ ఖాన్, వాజిద్,గౌస్,పాషా, దాస్, శ్రీనివాస్,బిజిలి కృష్ణ, నక్క ప్రకాష్, మాద రమేష్, రామేశ్వర్ రెడ్డి,ఊరడి మల్లికార్జున్, శాతూరు మహేష్ పోతరాజు రాజేంద్రకుమార్, రాజ్ ఠాకూర్, నార్ల కంటి విష్ణు, పోతురాజు మహేందర్ కుమార్, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్లు సుజాత, పద్మ, లక్ష్మి,భాగ్య తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS