TEJA NEWS

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష…


చిలుకూరు, సూర్యాపేట జిల్లా :
చిలుకూరు మండల కేంద్రంలో గల మండల విద్యా వనరుల కేంద్రం నందు సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయుచున్న వివిధ శాఖలకు చెందిన మండల ఉద్యోగస్తుల శాంతియుత నిరసన దీక్ష నాలుగవ రోజుకు చేరింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి ఎం గురవయ్య, నోడల్ అధికారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఈ నిరసన దీక్షకు మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగాఎస్ ఎస్ ఏ మండల అధ్యక్షులు చింత తేజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని అప్పటివరకు పే స్కేల్ కల్పించాలని, పదవీ విరమణ చేస్తున్న వారికి బెనిఫిట్స్ ఇవ్వాలని ,12 నెలల జీతం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన వారికి ధన్యవాదములు తెలియజేశారు. రేపటి నుంచి జరిగే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆర్ కృష్ణమూర్తి, కోశాధికారి సుమలత, స్పందన, పద్మ, కవిత, విజయనిర్మల ,ఝాన్సీ రాణి, స్వరూప, రాధా, నరసింహారావు ,శ్రీధర్ ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS